top of page

బ్రహ్మాస్త్రం ఈవెంట్ రద్దు వెనుకాల అసలేం జరిగింది?


ఈ నెల 25న పోలీస్ అనుమతి కోరుతూ ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ (శ్రేయాస్ మీడియా) సంస్ద తరపున రాచకొండ సీపీ ఆఫీస్ లోని ఈవెంట్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు.


25వ తేదీన దరఖాస్తు చేస్తే, 26న అక్నోలేజ్మెంట్ కాపీ ఇచ్చారు


చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్నారన్న విషయంలో వాస్తవం లేదు..8 రోజుల క్రితమే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నాం.ఈవెంట్ జరిగే ప్రాంతానికి రెండు రోజుల క్రితం స్థానిక సీఐ వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు.


గత అనుభవాల దృశ్య ఈ సారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీఐ చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటించేలా, లోపల సీసీ కెమెరా లతో పాటు బారికేడ్లు, పెద్ద సంఖ్యలో బౌన్సర్ లను మోహరించేందుకు ఏర్పాట్లు చేసాము.


ఈ రోజు జరిగే ఈవెంట్ బందోబస్తు కోసం వచ్చే 800మంది పోలీసులకు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేసాము.అన్ని సవ్యంగా సాగుతున్నాయన్న క్రమంలో సీఐ ఉన్న ఫలంగా ఫైల్ ని రిజెక్ట్ చేశారు...ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే భద్రత కారణాల దృశ్య అనుమతి నిరకరిస్తున్నట్టు చెప్పారు.


పాన్ ఇండియా సినిమా కావడంతో ఈవెంట్ నిర్వాహకులు చేసిన అతి భారీ ఏర్పాట్లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.


అన్ని రకాలుగా పోలీసులకు సహకరించేందుకు సిద్ధం అని అందు కోసం డిక్లరేషన్ ఇస్తామని చెప్పిన పెర్మిషన్ రిజెక్ట్ చేయడం మమ్మల్ని తీవ్ర నిరాశ పరిచింది.


Watch BRAHMĀSTRAM Press Meet